రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్-దంతెవాడ జిల్లాల్లో గురువారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మావోయిస్టులు మృతి చెందగా ఒక జవాన్ అమరడయ్యాడు. బీజాపూర్ జిల్లాలోని గంగలూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను తరలించామని ఎస్‌పి జితేంద్రయాదవ్ తెలిపారు. భద్రతా బలగాల రాకను గమనించిన మావోయిస్టులు తొలుత కాల్పులు జరపాని, దీంతో భద్రత బలగాలు ఎదురు కాల్పులు జరిపాయని వివరించారు. ఎదురుకాల్పుల్లో 18 మావోలు దుర్మరణం చెందగా ఒక జవాన్ మృతి చెందాడన్నారు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున మావోయిస్టులు పారిపోయారని వెల్లడించారు. ఘటనా స్థలంలో మందు గుండు సామాగ్రి, ఎకె 47, తుపాకులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నారాయణపూర్ జిల్లాలో ఐఇడి పేలడంతో ఒక జవాన్ గాయపడినట్టు సమాచారం.
బీజాపూర్ లో భారీ ఎన్ కౌంటర్: 18 మావోలు, ఒక జవాన్ మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -