Tuesday, December 24, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్: నలుగురు మావోలు మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో నలుగురు మావోలు మృతి చెందారు. మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం తెలియడంతో సిఆర్‌పిఎఫ్ జవాన్లు, డిస్ట్రిక్స్ రిజర్వ్ గార్డ్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. భద్రతా బలగాలు కనిపించగానే మావోయిస్టులు కాల్పులు జరిపారు. జవాన్లు జరిపిన కాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News