పోలీసులకు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు
10 నుంచి 12 మంది నక్సలైట్ల హతం
ఐఈడీ పేలుడులో ఇద్దరు సైనికులకు గాయాలు
కొనసాగుతున్న కాల్పులు
మన తెలంగాణ/చర్ల: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో 10 నుంచి 12 మంది నక్సలైట్లు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇరువైపుల నుంచి అడపాదడపా కాల్పులు జరుగుతున్నా యి. అయితే నక్సలైట్ హతమైనట్లు ఇంకా నిర్ధారణ కాలేదు. దక్షిణ బస్తర్‌లోని పూజారి కంకేర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. అందిన సమాచారం ప్రకారం… బీజాపూర్ డీఆర్‌జీ సుక్మా, డీఆర్‌జీ దంతేవాడ, కోబ్రా, సీఆర్‌పీఎఫ్ వివిధ బెటాలియన్లు సుమారు 1200 నుంచి 1500 మంది సైనికులు నక్సలైట్లను చుట్టుముట్టారు. అడవిలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు ఉన్నారు.
వీరిలో కొందరు పెద్ద నక్సల్ నాయకులు కూడా ఉన్నారు. బీజాపూర్‌లోని ఐఈడీ పేలుడులో ఇద్ద రు జవాన్లు గాయపడ్డారు. సైనికులు ఐఈడీ దాడి చేశారు. నక్సలైట్లు ఇప్పటికే ఆ ప్రాంతంలో ఐఈడీని అమర్చారు. ఇంతలో సైనికుల పాదాల ఒత్తిడి ఐఈడీపై పడి భారీ పేలుడు సంభవించింది. సైనికులిద్దరికీ కాలికి గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కూ డా నిర్వహిస్తున్నారు. జనవరి 12న ఐదుగురు నక్సలైట్ల హతమయ్యా రు. అంతకుముందు జనవరి 12న బీజాపూర్‌లోని మద్దెడ్ ప్రాంతం లో ఇద్దరు మహిళా నక్సలైట్లు సహా ఐదు మంది నక్సలైట్లను బలగాలు హతమార్చాయి. ఘటనా స్థలం నుంచి ఐదుగురి మృతదేహాలతోపాటు ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని బీజాపూర్ ఎస్పీ జితేంద్రయాదవ్ ధృవీకరించారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఒక ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, 12 బోర్ గన్, 2 సింగిల్ షాట్ గన్‌లు, ఒక బీజీఎల్ లాంచర్, 1 కంట్రీ గన్‌తోపాటు పేలుడు పదార్ధాలు, నక్సల్ సాహిత్యం, నక్సల్స్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.