Sunday, January 5, 2025

ఛత్తీస్ గఢ్‌లో ఎన్‌కౌంటర్… మావోయిస్టు మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: దండకారణ్యం రక్తంతో తడిసిముద్దవుతోంది. రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. బీజాపూర్ జిల్లా కేశకతుల్ అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా పలువురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామాగ్రి, ఎకె47 రైఫిళ్లు, పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకే కుంబింగ్ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఇంకా వివరాలు తెలియాల్సింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News