Wednesday, January 22, 2025

మహిళపై ఐదుగురు అత్యాచారం… సిగరెట్లతో కాల్చి…

- Advertisement -
- Advertisement -

లక్నో: ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెపై ఐదుగురు కామాంధులు అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ మహిళ ఒంటరిగా ఉండడం ఐదుగురు వ్యక్తులు గమనించి ఆమె ఇంట్లోకి పైకప్పు నుంచి వెళ్లారు. ఆమె ముక్కు దగ్గర మత్తు మందు కలిపిన వస్త్రాన్ని పెట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమె చేతులు కట్టేసి ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఆమెపై సిగరేట్లతో వాతలు పెట్టారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం బాధితురాలును ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News