Monday, December 23, 2024

మంచిర్యాలలో బైక్-ట్రాక్టర్ ఢీ: తండ్రీకుమారుడు మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీరాంపూర్: మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ లో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చి అదుపుతప్పిన బైక్- ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతిచెందారు. ఈ దుర్ఘటనలో తల్లికి తీవ్రగాయాలయ్యాయి. తక్షణమే ఆమెను సమీప ఆస్పత్రి తరలించారు.

బాధితులను మందమర్రి మండలం శంకర్ పల్లి వాసులుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News