Monday, December 23, 2024

బైక్ ప్రమాదం: ఇద్దరు యువకులు మృతి.. మరొకరికి సీరియస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బైక్ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరికి సీరియస్ గా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బైక్ పై మేడేపల్లి నుండి ఖమ్మం వెళ్ళుతుండగా ఖమ్మం చర్చి కాంపౌండ్ బ్రిడ్జి వద్ద బైక్ అదుపుతప్పి పడటంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి యువకులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు పగిళ్ళ ఉదయ్ కుమార్ (21), పోతునూక శివ (21) లుగా గుర్తించిన పోలీసులు. పోలగాని రవీందర్ పరిస్థితి విషమం హాస్పిటల్ కు తరలించిన పోలీసులు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News