Friday, December 20, 2024

నిర్మల్‌లో బైక్‌, ఆర్టీసీ బస్సు ఢీ: ఒకరు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

సారంగపూర్: నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహబూబ్ ఘాట్ వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన బైకు, ఆర్టీసీ బస్సు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News