Friday, December 27, 2024

బైకులో చెలరేగిన మంటలు.. ఒకరు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

Bike catches fire in Karnataka mandya

బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. బైకుకులో మంటలు అంటుకున్నాయి. శివరాముడు అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి బైక్ పై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో శివరాముడు సజీవదహనమయ్యాడు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. పెట్రోల్ ట్యాంకు లీక్ కావడంతోనే ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News