Sunday, December 22, 2024

బైక్ నేర్చుకోవడానికి వెళ్లిన అన్నదమ్ములు.. అన్న స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

బెజ్జురు: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జురు మండలం కుకుడులో శుక్రవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన బైకు కొర్పేగూడ వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘనటో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అన్నదమ్ములు ఇద్దరు నితీశ్(16), యస్వంత్(14) బైక్ నేర్చుకోవడానికి బైకుపై బయటకు వెళ్లారు. ఈ క్రమంలోనే విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నితీశ్ మృతిచెందాడు. యస్వంత్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో హుటహుటినా అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News