Monday, December 23, 2024

యమునా నదిలో బైక్ స్టంట్…. (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: యువతకు చేతిలో బైక్ ఉంటే చాలు వివిధ రకాల స్టంట్ లు వేసి ప్రమాదాలు కొన్ని తెచ్చుకుంటున్నారు. బైక్ తో స్టంట్ వేసి ప్రాణాలు పోయినవాళ్లు కోకొల్లలుగా ఉన్నారు. తాజాగా ఓ యువకుడు ఢిల్లీ పార‌ల‌ల్ కెనాల్‌లో బైక్ స్టంట్ వేశాడు. హర్యానాలోని పానిపట్ కు చెందిన యువకుడు బైక్ అతి వేగంగా డ్రైవ్ చేస్తూ కాలువలోకి దూసుకెళ్లాడు. నదిలో బైక్ మునిగిపోగానే అతడు ఈదుకుంటూ బయటకు వచ్చాడు. అక్కడి ఉన్న కొందరు యువత అతడిని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా  చప్పట్లు ఈలలు వేశారు. 34 సెకన్ల గల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటనపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 1973లోని 144 సెక్షన్ ప్రకారం యమునా నదిలో బట్టలు ఉతకడం, స్నానం చేయడంలాంటివి నిషేధం విధించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News