Sunday, December 22, 2024

పాతబస్తీలో బైకుల చోరీ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Bike theft gang arrested in Patabasti

 

హైదరాబాద్: పాతబస్తీలో బైకుల చోరీల ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా చోరీలు చేస్తున్న ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 53 ద్విచక్రవాహనాలను చాంద్రాయణగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫైనాన్సియర్లు సీజ్ చేసిన వాహనాలంటూ షాద్ నగర్, కేశంపేటలో వాహనాలను అమ్ముతున్నారని తెలిపారు. పక్కా సమాచారంతో బైకుల చోరీ ముఠా గుట్టు రట్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News