Sunday, December 22, 2024

బైక్‌ల దొంగ అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బైక్‌లు చోరీ చేస్తున్న ముగ్గురు యువకులను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేశారు. యువకుల వద్ద నుంచి నాలుగు బుల్లెట్ బైక్‌లు, హీరో డీలక్స్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.8లక్షలు ఉంటుంది. ఈస్ట్‌జోన్ డిసిపి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎపి రాష్ట్రం, గుంటూరు జిల్లా, తంగెడకు చెందిన గుంజి రామాంజనేయులు, గోగుల గోపాలకృష్ణ, షేక్ కిసింగపల్లి భాష కలిసి బైక్‌లు చోరీ చేస్తున్నారు.

నిందితులు బైక్‌పై వెళ్తుండగా పోలీసులు ఆపి తనిఖీ చేయగా నిందితులు బైక్‌లు చోరీ చేసే వారని తెలిసింది. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా గతంలో చోరీ చేసిన బైక్‌ల గురించి చెప్పాడు. నిందితులపై సుల్తాన్‌బజార్, గోపాలపురం, అఫ్జల్‌గంజ్, సూర్యపేట జిల్లాలోని చింతలపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News