Friday, January 3, 2025

మెట్రో పార్కింగ్‌లలో బైక్‌ల దొంగ పట్టివేత..59 బైక్‌లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

నగరంలోని పలు మెట్రో స్టేషన్ పార్కింగ్‌లలో పెట్టిన బైక్ లను దొంగలించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పార్కింగ్ లో పెట్టిన వాహనాల చోరికి పాల్పడిన చైతన్య సాయికుమార్ ను అరెస్ట్ చేసినట్లు నార్త్ జోన్ డిసిపి సాధన రష్మి పెరుమాళ్ వెల్లడించారు. నిందితుడి తోపాటు ఇద్దరు రిసివర్స్‌ను బేగంపేట పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. నిందితుడి దగ్గర నుంచి 59 బైకులు స్వాధీనం చేసుకున్నారు.

జేబీఎస్, మెట్రో స్టేషన్ పార్కింగ్లో ఉంచిన బైకులతోపాటు సిటీలో పలు మెట్రో స్టేషన్ లోని నిలిపిన బైకులను చైతన్య సాయి కుమార్ కొట్టేశాడు. చైతన్య సాయి కుమార్ మెట్రో, జెబిఎస్ పార్కింగ్ ప్రదేశాల్లో బైక్ లను చోరీ చేసి జగదీశ్.. హరికృష్ణ అనే వ్యక్తులకు అమ్ముతున్నట్లు విచారణలో తెలినట్లు పేర్కొన్నారు. మూడు కమిషనరేట్ పరిధిలో 90 రోజుల్లో 59 బైకులు దొంగలించాడు. కొట్టేసిన బైక్ లు వేరే చోట పార్కింగ్ పెట్టి అమ్మేస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News