Sunday, December 22, 2024

స్కూటర్‌తో వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన యువకుడు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : బెంగళూరు లోని రద్దీగా ఉన్న మగది రోడ్డుపై పట్టపగలు మంగళవారం ఓ 25 ఏళ్ల యువకుడు తన స్కూటర్‌తో 71 ఏళ్ల వృద్ధుడ్ని కొంత దూరం ఈడ్చుకెళ్లిన దారుణ సంఘటన జరిగింది. ఎట్టకేలకు ఆ స్కూటర్ యువకుడిని పట్టుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మగది రోడ్డులో సాహిల్ అనే యువకుడు తన స్కూటర్‌పై వస్తూ ముత్తప్ప అనే 71 ఏళ్ల వృద్ధుడి కారును ఢీకొన్నాడు. దీంతో ముత్తప్ప కారు దిగి యువకునితో వాగ్వాదానికి దిగాడు. తన తప్పు తెలుసుకున్న ఆ యువకుడు తప్పించుకునే ప్రయత్నం చేయగా, ముత్తప్ప ఆ స్కూటర్‌ను వెనుక నుంచి గట్టిగా పట్టుకుని కదలకుండా అడ్డుకున్నాడు.

అయినా ఆ యువకుడు ఆగకుండా స్కూటర్‌తో సహా వృద్ధుడ్ని ఈడ్చు కెళ్లాడు. ఆ రోడ్డులో వెళ్తున్న వాహనదారులు ఇది గమనించి కేకలు వేసినా యువకుడు పట్టించుకోలేదు. దాంతో తమ వాహనాలను అడ్డంగా ఉంచి స్కూటర్‌ను ఆపేశారు. ఈ సంఘటనంతా వీడియోలో రికార్డు అయింది. సమాచారం అందుకున్న గోవిందరాజ్ నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడ్ని అరెస్టు చేశారు. గాయపడిన వృద్ధుడ్ని ఆస్పత్రిలో చేర్చారు. ఢిల్లీలో ఇటీవల ఇదే విధంగా 20 ఏళ్ల యువతిని వాహనంతో ఈడ్చుకెళ్లగా ఆమె మృతి చెందిన సంఘటన తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News