Sunday, December 22, 2024

బంజారాహిల్స్‌లో హిట్ అండ్ రన్

- Advertisement -
- Advertisement -

Bikers injured in hit and run case

హైదరాబాద్ : హిట్ అండ్ రన్ కేసులో బైక్‌పై వెళ్తున్న వారికి గాయాలైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటేచేసుకుంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంలో యాక్టివా బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. దీంతో యాక్టివా బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన బంజారాహిల్స్ పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. కారుతో ఢీకొట్టిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News