Wednesday, January 22, 2025

హడలెత్తిస్తున్న ర్యాష్ డ్రైవింగ్

- Advertisement -
- Advertisement -

 

కరీంనగర్: కరీంనగర్ పట్టణంలో పోకిరిల ర్యాష్ డ్రైవింగ్ వాహనదారులతో పాటు నడుచుకుంటూ వెళుతున్న వారిని హడలెత్తిస్తోంది. పోకిరిలు అతివేగంతో డ్రైవ్ చేస్తుండటంతో పాటు సైలెన్సర్‌ను రేస్ చేస్తు వేగంగా వెళుతున్నారు. దీంతో ఫ్యామిలీతో బైకుపై ప్రయాణిస్తున్న వారు, నడుచుకుంటూ వెళుతున్న వారు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పోకిరిల ర్యాష్ డ్రైవింగ్ వలన ప్రమాదాలు జరిగే అవకాశలు ఉన్నాయని వాహనాదురులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అతివేగంతో డ్రైవింగ్ చేస్తున్న వారిపై ట్రాఫిక్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించిన కరీంనగర్ పోలీసులు కొన్ని రోజులుగా వీరిపై దృష్టి సారించక పోవడంతో మళ్ళీ వేగంగా వెళ్తూ చెలరేగిపోతున్నారని వాహనదారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News