Sunday, December 22, 2024

బైక్‌ల దొంగ అరెస్టు

- Advertisement -
- Advertisement -

bikes thief arrested in hyderabad

22 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
వివరాలు వెల్లడించిన డిసిపి రక్షితమూర్తి

హైదరాబాద్: వ్యసనాలకు బానిసగా మారిన యువకుడు బైక్‌లు చోరీ చేస్తుండగా ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 22 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్‌గిరి డిసిపి రక్షిత మూర్తి తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూర్యపేట జిల్లా, నాగారం మండలం, ఏటూరు గ్రామానికి చెందిన వంగాల రాజు లైటింగ్ పనిచేస్తున్నాడు. తండ్రి రెండో వివాహం చేసుకోగా, తల్లీ వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. వ్యసనాలకు బానిసగామారిన రాజు లిక్కర్, సిగరేట్ తదితరాలకు డబ్బులు సరిపోయేవి కావు.

లైటింగ్ పని నాగోల్, ఎల్‌బి నగర్‌లో చేయగా నెలకు రూ.12,000 వచ్చేవి, ఇవి వసనాలకు సరిపోవడంలేదు.దీంతో బైక్‌లను చోరీ చేసి తన గ్రామంలోని వారికి తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఫైనాన్స్ కంపెనీ డబ్బులు కట్టని వారి వద్ద నుంచి బైక్‌లను తీసుకుని వచ్చిందని చెప్పి పలువురికి విక్రయించాడు. బైక్‌లకు సంబంధించిన కాగితాలను నెల తర్వాత ఇస్తానని వారిని నమ్మించాడు. ఇలా రాత్రి సమయంలో మెట్రో స్టేషన్లు, కాలనీల్లో తిరుగుతు డూప్లికేట్ కీలతో చోరీలు చేస్తున్నాడు. ఉప్పల్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా నిందితుడు బైక్‌పై వచ్చాడు. బైక్ కాగితాలు చూపించాల్సిందిగా పోలీసులు కొరగా తడబడ్డాడు, వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయాలు బయపటపడ్డాయి. ఉప్పల్ ఇన్స్‌స్పెక్టర్లు గోవింద రెడ్డి, నర్సింగరావు, ఎస్సై కోటేశ్వర్ పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News