Monday, December 23, 2024

ఐదు సంవత్సరాల వారెంటీతో బైక్‌వో ఎలక్ట్రికల్ వాహనాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐదు సంవత్సరాల బంపర్ టు బంపర్ వారెంటీ తో బైక్‌వో ఎలక్ట్రికల్ వాహన సంస్థ తొలిసారిగా నగరంలోకి అడుగు పెడుతోంది. ఇండియా నంబర్ 1 మల్టీ బ్రాండ్ సంస్థగా బైక్‌వో గుర్తింపు పొందింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 31 లో కార్యాలయంలో సోమవారం బైక్‌వో సంస్థ సీఓఓ, సహ వ్యవస్థాపకులు విద్యా సాగర్ రెడ్డి మాట్లాడుతూ.. బైక్‌వో సంస్థ వినియోగదారుల కోసం ఈ ప్రత్యేకమైన ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందని అన్నారు. తమ వద్ద ఉన్న మల్టీ బ్రాండ్ ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ అవకాశాన్ని అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సరళ్ తల్వార్ (డైరెక్టర్ సేల్స్ & కో-ఫౌండర్, బైక్‌వో), K.మణిదీప్ (సహ వ్యవస్థాపకుడు, బైక్‌వో) మరియు ప్రముఖ మోడల్‌ పాల్గొన్నారు.

ఈ ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి నాణ్యమైన సేవలను అందించాలని ఉద్దేశంతోనే ఈ సరికొత్త వారెంటీ తో అడుగుపెట్టినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రికల్ వాహనాలకు సంఖ్య పెరిగిందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వాహనదారుడికి మరింత భద్రత కల్పించేందుకు ఈ వారంటీని అందిస్తున్నామన్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీ వాహనానికి మాది బాధ్యత అంటూ ముందుకు వస్తున్నామని చెప్పారు.

“ఈ ఆఫర్‌ను పొందేందుకు, మీరు ఎంపిక చేసుకున్న బహుళ-బ్రాండ్ ఎలక్ట్రానిక్ వాహనాల శ్రేణిలో తక్కువ ధరలో, నిర్వహణ-రహిత ఈవీ ల నుండి అత్యంత ఖరీదైన ఇ-బైక్‌ల వరకు ఎంచుకోవచ్చు అన్నారు. ఈ బైక్ వో వాహనాలను నచ్చిన మోడల్‌ను ఎంపిక చేసుకోవడం తో పాటు, అత్యుత్తమ ఆఫర్‌లు, సమీప ఛార్జింగ్ స్టేషన్‌లకు యాక్సెస్ మరియు ప్రత్యక్ష అనుభవాన్ని ఇక్కడ పొందవచ్చని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News