Saturday, December 21, 2024

బాలికలపై బాబా అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: నలుగురు బాలికలను కిడ్నాప్ చేసి అనంతరం వారిపై బాబా అత్యాచారం చేసిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మాయలు, మంత్రాల పేరులో కులేశ్వర్ సింగ్ రాజ్‌పూత్ అలియాస్ పండిత్ ఠాకూర్ బాబా పేరుతో చెలామణి అవుతున్నాడు. గణేశ్ సాహూ(52), దనియా బంజారే(42), కన్హయా(40), హుల్సి రాత్రే(30) బాబాకు సేవలు చేస్తూ గడుపుతున్నారు. కుటుంబంలో వచ్చిన కష్టాలను నష్టాలను బాబా తీరుస్తారని చెప్పి బంజారే, రాత్రే అతడి వద్దకు కొన్ని కుటుంబాలను తీసుకొచ్చారు. దీంతో బాలికలను పనులు నిమిత్తం వేరే రూమ్‌కు తీసుకెళ్లి వాళ్లపై బాబా అత్యాచారం చేశాడు. అనంతరం బాలికలు తన తల్లిదండ్రులతో వెళ్తుండగా వారికి రూ.2000, రూ.4000 ఇచ్చారు. బయటకు వచ్చిన తరువాత బాలికలు తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పడంతో రతన్‌పూర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు 366 ఎ (కిడ్నాప్), 376 (రేప్) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News