Monday, December 23, 2024

బిల్కిస్ బానో కేసు తీర్పుకు వ్యతిరేకంగా పిటిషన్లు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బిల్కిస్‌బానో గ్యాంగ్ రేప్, హత్య కేసులో దోషులకు క్షమాభిక్ష, శిక్షాకాలం ముగియక ముందే విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జులై 17 కు వాయిదా పడింది. ఈ కేసులో 11 మంది దోషులు గత ఏడాది విడుదలైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులకు ఎవరికైతే నోటీస్‌లు అందలేదో వారికోసం సుప్రీం కోర్టు మే 9న వెలువరించిన ఉత్తర్వు ప్రకారం స్థానిక వార్తా పత్రికల్లో, గుజరాత్, ఇంగ్లీష్ పత్రికల్లో నోటీస్‌లు వెలువడ్డాయని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ప్రస్తావించింది.

అయితే విచారణకు సమయాభావం కావడంతో ఈ పిటిషన్లపై విచారణ జులై 17కు ధర్మాసనం వాయిదా వేసింది. అంతకు ముందు సుప్రీం ధర్మాసనం స్థానిక వార్తా పత్రికల్లో నిందితులకు వ్యతిరేకంగా నోటీస్‌లు ప్రచురింప చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే దోషులకు నోటీసులు అందలేదో వారికి ఈ పత్రికల ద్వారా తెలియజేయాలని ఆదేశించింది. కోర్టు మార్చి 27న వెలువరించిన ఆదేశాలపై తామెలాంటి అభ్యంతరాలు తెలియజేయడం లేదని, అలాగే ఎలాంటి వ్యాజ్యాలు వ్యతిరేకంగా దాఖలు చేయలేదని కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం కోర్టుకు తెలియజేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News