Monday, December 23, 2024

చివరకు న్యాయమే గెలిచింది

- Advertisement -
- Advertisement -

చివరకు న్యాయమే గెలిచింది
బిజెపికి ఈ తీర్పు చెంపపెట్టు
బిల్కిస్ బానో కేసులో సుప్రీం తీర్పుపై ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో 11 మంది నేరస్థులను శిక్షాకాలం ముగియక ముందే ముందుగానే జైలు నుంచి విడుల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రతిపక్షాలు సోమవారం స్వాగతించాయి. ఇది న్యాయానికి దక్కిన విజయంగా అభివర్ణించిన ప్రతిపక్షాలు మహిళలకు బిజెపి వ్యతిరేకమని, నేరస్థులను పెంచిపోషిస్తోందని ఆరోపించాయి. అహంకార బిజెపి ప్రభుత్వంపై న్యాయం సాధించిన విజయానికి బిల్కిస్ బానో అవిశ్రాంత పోరాటం ఒక ఉదాహరణగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు.

ఎన్నికల లబ్ధి కోసం న్యాయాన్ని హతమార్చే పోకడలు ప్రజాస్వామిక వ్యవస్థకు ప్రమాదకరమని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాసిన ఒక పోస్టులో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేరస్థులను పెంచిపోషిస్తున్నది ఎవరో దేశానికి మరోసారి తెలియచేసిందని ఆయన పేర్కొన్నారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించారు. చివరకు న్యాయమే గెలిచిందంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో బిజెపి మహిళా వ్యతిరేక విధానాలపై ప్రజలకు స్పష్టత వచ్చిందని, న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం మరింత బలపడిందని ఎక్స్‌లో రాసిన పోస్టులో ఆమె పేర్కొన్నారు. న్యాయం కోసం అమిత ధైర్యంతో పోరాటం సాగించిన బిల్కిస్ బానోకు ప్రియాంక శుభాకాంక్షలు తెలిపారు. 11 మంది రేపిస్టుల విడుదలపై గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో మహిళల పట్ల బిజెపి వ్యతిరేకత బటయటబయలైందని కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా వ్యాఖ్యానించారు.

ఈ నేరస్థుల అక్రమ విడుదలకు సహకరించిన, వారిని సన్యానించిన, స్వీట్లు తినిపించిన వారందరికీ సుప్రీంకోర్టు తీర్పు పెంప పెట్టని ఖేరా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు. మహిళా సాధికారత విషయంలో బిజెపి చేస్తున్న డొల్ల వ్రాదనలు బట్టబయలయ్యాయని ఆయన ఆరోపించారు. ఏ ప్రభుత్వం అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుని అటువంటి నేరస్థుల విడుదలకు ఆమోదించకూడదని, అమత్ షా నేతృత్వంలోని కేంద్ర హెం మంత్రిత్వశాఖ ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు.

ఈ ఖైదీల ముందస్తు విడుదలకు కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపిందని, నారీ శక్తిపై ప్రధాని మోడీ డొల్ల వాగ్దానాలు చేస్తారని స్పష్టమైందని ఒవైసీ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పుపై తృణమూల్ కాంగ్రెస్ కూడా తీవ్రంగా స్పందించింది. బిలిక్స్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేరస్థుల విడుదలకు అనుమతించి వారిని గొప్పగా కీర్తించిన బిజెపికి చెంపపెట్టని టిఎంసి పేర్కొంది. శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ గుజరాత్ హైకోర్టు నుంచి క్షమాభిక్ష వచ్చేముందు దీనికి కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చిందన్న విషయం ఎవరూ మరచిపోరాదని పేర్కొన్నారు. బిల్కిస్ బానో న్యాయం కోసం అసమాన తెగువను ప్రదర్శించారని ఆమె ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News