Monday, December 23, 2024

బిల్కిస్ బానో కేసు: దోషులకు క్షమాభిక్ష రద్దు

- Advertisement -
- Advertisement -

బిల్కిస్ బానో కేసులో దోషులకు క్షమాభిక్ష రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో క్షమాభిక్ష పొంది, బయటకు వచ్చిన 11మందికీ క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. 2002లో గోద్రా రైలు దగ్ధకాండ అనంతరం గుజరాత్ లో అల్లర్లు చెలరేగిన సమయంలో దుండగులు బిల్కిస్ బానో ఇంటిపై దాడి చేసి, ఇంట్లోని ఏడుగురుని హత్య చేసి, ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ కేసులో నిందితులకు సిబిఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే నిందితులకు గుజరాత్ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 15న క్షమాభిక్ష ప్రసాదించింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దోషుల్లో ఒకరైన న్యాయవాది రాధేశ్యామ్ షా తిరిగి న్యాయవాద వృత్తిని చేపట్టారు కూడా. దోషులను ముందుగానే విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News