Tuesday, January 21, 2025

కేంద్రం విధానం గుజరాత్‌కు వర్తించదా?

- Advertisement -
- Advertisement -

అత్యాచార దోషులను వదిలిపెట్టరాదని స్పష్టం చేసిన కేంద్రం
అయినా బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులను విడిచిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రధాని మోడీ చెప్పిన ‘నారీశక్తి’ బలోపేతం ఇదేనా?
మండిపడుతున్న విపక్షాలు

Bilkis Bano case convicts released by gujarat govt

అహ్మదాబాద్: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదలచేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రప్రభుత్వాలకు మార్గదర్శకాలను కూడా పంపించింది. ఉగ్రవాద కార్యకలాపాలు, హత్యలు, అత్యాచారం కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న వారిని విడుదల చేయకూడదని ఆ మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. అయితే ఆ నిబంధనలకు విరుద్ధంగా గుజరాత్‌లో 2002లో జరిగిన బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మందిని రాష్ట్రప్రభుత్వం విడుదల చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కేంద్ర విధానం ప్రకారం ఏ విధంగా చూసినా వీరిని విడుదల చేయడానికి అవకాశం లేదు. అయితే వీరి విడుదలకు గుజరాత్ రాష్ట్రప్రభుత్వం కేంద్రం మార్గదర్శకాలకు భిన్నంగా తనదైన సొంత విధానాన్ని పాటించినట్లు కనిపిస్తోంది. 2002 మార్చి 3న గుజరాత్ అల్లర్ల లో భాగంగా దుండగులు 21 ఏళ్ల బిల్కిస్ బానోపై సా మూహిక అత్యాచారం జరిపి ఆమె మూడేళ్ల కుమార్తె స హా ఆమె కుటుంబంలోని ఆరుగురిని దారుణంగా హత్య చేశారు.

ఆ సమయంలో బిల్కిస్ బానో అయిదు నెలల గర్భిణి. అంతకు కొద్ది రోజుల ముందు సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీకి నిప్పు పెట్టి 59 మంది కరసేవకులు సజీవ దహనం చేసిన ఘటన కారణంగా చెలరేగిన హింసాకాండనుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారంతా అ హ్మదాబాద్ సమీపంలోని ఓ పొలంలో దాగి ఉన్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. 2008లో ముంబయిలోని ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మంది నిందితులకు యావజ్జీవ ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. అనంతరం బాంబే హైకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించింది. 2019లో సుప్రీంకోర్టు బిల్కస్ బానోకు రూ.50 లక్షల పరిహారం, ఇల్లు, ఉద్యోగం కల్పించాలని గుజరా త్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదంతా జరిగిన మూడే ళ్లు గడవక ముందే దోషులందరూ విడుదల కావడం గమనార్హం. అయితే ఈ కేసుకు సంబంధించిన దోషు ల్లో ఒకరి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సాకుగా తీసుకుని గుజరాత్ రాష్ట్రప్రభుత్వం వీరి విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

తాను ఇప్పటికే 15ఏళ్ల జైలు శిక్ష అనుభవించినందున నేర శిక్షాస్మృతి కింద తనను విడుదల చేయాలని ఈ ఏడాది ప్రారంభంలో దోషులో ్లఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో శిక్షలు ఖరారు చేసే సమయంలో అ మలులో ఉన్న 1992 నాటి రాష్ట్రప్రభుత్వ విధానం ప్రకా రం నిర్ణయం తీసుకోవలసిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను తనకు అనువుగా మలుచుకున్న రాష్ట్రప్రభుత్వం మొత్తం 11 మంది దోషులను విడుదల చేసింది. సోమవారం గోద్రా జైలునుంచి విడుదల అయిన వీరికి వారి కుటుం బ సభ్యులు మిఠాయిలతో స్వాగతం పలికారు. అయితే రాష్ట్రప్రభుత్వం నిర్ణయం ఇప్పుడు రాజకీయ వివాదానికి కారణం అయింది. గుజరాత్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదేనా మీరు చెప్పే మహిళా సాధికారత: కాంగ్రెస్

కాగా బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో శి క్ష పడిన 11 మందిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చే యడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.‘ నిన్న ఎర్రకోట బురుజులపైనుంచి ప్ర ధాని మోడీ మహిళల భద్రత, సాధికారత, మహిళలను గౌరవించడం గురించి గొప్పగొప్పమాటలు చెప్పారు. అది జరిగిన కొద్ది గంటలకే గుజరాత్ ప్రభుత్వం అత్యాచారం కేసులో దోషులగా ఉన్న వారినందరినీ విడిచిపెట్టింది. విడుదల చేసిన వారిని సన్మానించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇదేనా అమృత్ మహోత్సవ్’ అని ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రశ్నించారు. తాను చెప్పిన మాటలపై తనకు నమ్మకం ఉందో లేదో ప్రధాని దేశ ప్రజలకు చెప్పాలని కూడా ఆయన అన్నారు.
ఒవైసీ విమర్శ..
ఆలిండియా మజ్లిస్ ఇత్తేహాద్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం ప్రధాని మోడీపై మండిపడ్డారు. ‘ఆయ న (మోడీ) ‘నారీశక్తి’ ని సమర్థిస్తూ గొప్పగా చెప్పారు. అయితే అదే రోజు గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వం గ్యాంగ్ రేప్ కేసులో శిక్షలు అనుభవిస్తున్న వారిని విడుదల చేసింది. వీటి సందేశం సేస్పష్టం’ అని ఒవైసీ ఓ ట్వీ ట్‌లో విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్, బిఎస్‌పి స హా విఓక్షాలన్నీ కూడా గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోడీనిని టారెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

మీడియా ద్వారానే తెలిసింది….బానో భర్త యాకూబ్ రసూల్

కాగాతన భార్య అత్యాచారం కేసులో దోషులందరినీ విడుదల చేశారని తెలిసి ఆశ్చర్య పోయామని బిల్కిస్ బానో భర్త యాకూబ్ రసూల్ పిటిఐకి చెప్పా రు. వీరి విడుదలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని, పత్రికల్లోమాత్రమే చూసి తెలుసుకున్నామని ఆయన చెప్పారు. ఈ విషయమై తా ము ఎలాంటి వ్యాఖ్యా చేయదలచుకోలేదని ఆయన అంటూ, ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తమ ఆత్మీయుల ఆత్మ శాంతికి ప్రార్థించడమొక్కటే తాము చేయగల పని అని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గుజరాత్ ప్రభుత్వం తమకు రూ.50 లక్షల పరిహారం చెల్లించిందని, అయితే కోర్టు ఆదేశించినట్లుగా ఉద్యోగం, ఇల్లు ఇవ్వలేదని రసూల్ చెప్పారు. తన భార్య, అయిదుగురు పిల్లలతో తాము ఇప్పటికీ ఒక విధంగా అజ్ఞాత జీవితం గడుపుతున్నామని ఆయన చెప్పారు. కాగా ప్రస్తుతం బిల్కిస్ బానో పెద్ద కుమారుడి వయసు 20 ఏళ్లు. కాగా కుటుంబ సభ్యులను కలుసుకోబోతున్నందుకు, కొత్త జీవితాన్ని గడపబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని దోషుల్లో ఒకరయిన రాధేశ్యామ్ షా చెప్పారు. సుప్రీంకోర్టులో ఈయన దాఖలు చేసిన పిటిషన్ వల్లనే ఇప్పుడు దోషులంతా విడుదలయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News