Monday, December 23, 2024

బిల్కిస్‌బానో కేసు.. నిందితుల విడుదలపై నవంబర్ 29న సుప్రీం విచారణ

- Advertisement -
- Advertisement -

Bilkis Bano case hearing on November 29

న్యూఢిల్లీ : బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో యావజ్జీవ ఖైదు పడిన 11 మంది దోషుల శిక్షాకాలాన్ని గుజరాత్ ప్రభుత్వం తగ్గించి ముందుగానే విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు నవంబర్ 29న విచారణ చేపట్టనున్నది. ఈమేరకు కేసును లిస్టు చేసింది.గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గుజరాత్ ప్రభుత్వం సోమవారం కోర్టుకు వివరణ ఇచ్చింది. సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నందున దోషుల శిక్షాకాలం తగ్గింపునకు అనుమతిస్తూ కేంద్రం నుంచి తగిన ఆదేశాలను తాము పొందినట్టు పేర్కొంది. బిల్కిస్ బానో అత్యాచారానికి గురైన సమయంలో ఆమె కు 21 ఏళ్లు. ఐదు నెలల గర్భిణి. 2002 గోద్రా అల్లర్ల సమయంలో జరిగిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరగడమే కాక, ఆమె కుటుంబం లోని ఏడుగురిని హత్య చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిందింది. హత్యకు గురైన వారిలో బానో కుమార్తె కూడా ఉంది.

ఈ కేసుకు సంబంధించిన 11 మంది నిందితుల. శిక్షాకాలం తగ్గింపును సవాలు చేయడం ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడంగా గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. కేసు విచారణ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన సమాధానాన్ని అన్ని పక్షాలకు అందుబాటులో ఉంచాలని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని కోరగా ఈమేరకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కేసులో ప్రమేయం ఉన్న న్యాయవాదులందరికీ కౌంటర్ అఫిడవిట్ల కాపీలను అందజేయాలని కోర్టు గుజరాత్ ప్రభుత్వం, నిందితుల తరఫు న్యాయవాదికి సూచించింది. ఇదిలా ఉండగా గుజరాత్ ప్రభుత్వం దోషుల విడుదలపై సోమవారం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. హోం మంత్రిత్వశాఖ ఆమోదం అనంతరమే దోషులను విడుదల చేసినట్టు గుజరాత్ సర్కారు తెలిపింది. బిల్కిస్ బానో కేసులో 11 మంది నిందితులపై నిర్ణయం తీసుకునే ముందు 1992 నాటి రిమిసన్ పాలసీ కింద అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకున్నట్టు అఫిడవిట్‌లో గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. దోషుల సత్ప్రవర్తనతోపాటు 14 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించినందునే శిక్షను తగ్గించి విడుదల చేసినట్టు పేర్కొంది.

మోదీజీ ఉద్దేశమేంటో … రాహుల్ ధ్వజం
ఈ కేసులో సుప్రీం కోర్టు విచారణ చేపట్టనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోడీ, బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఎర్రకోట నుంచి మహిళల గౌరవంపై సుదీర్ఘ ప్రసంగాలు … వాస్తవంలో రేపిస్టులకు మద్దతుగా నిర్ణయాలు.. ప్రధాని మోడీ హామీలు, ఉద్దేశాల మధ్య తేడా స్పష్టంగా తెలుస్తోంది. మోడీజీ మహిళలను మోసం చేస్తున్నారు అని రాహుల్ మండి పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News