Thursday, January 23, 2025

న్యాయపోరాటంలో బిల్కిస్ బానోకు భారతీయుల అండ

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్(గుజరాత్):  తన భార్య బిల్కిస్ బానోకు న్యాయం జరిగేంత వరకు ఆమె చేసే పోరాటానికి భారతీయులు అండగా నిలబడతారని ఆమె భర్త యాకుబ్ రసూల్ ఓ ఇంటర్వూలో తెలిపారు. బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసిన, అనేక మందిన హత్య చేసిన 11 మందిని ముందస్తుగానే జైలు నుంచి విడుదల చేయడంపై ఆమె కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ మూడేళ్ల కూతురును కూడా వారు హత్య చేశారని రసూల్ తెలిపారు. న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఆయన ‘ది వైర్’ పాత్రికేయురాలు అర్ఫా ఖానుమ్ షేర్వాణికి ఇచ్చిన ఇంటర్వూలో అనేక విషయాలు చెప్పారు. ప్రస్తుతం వారుండే రాష్ట్రం గుజరాత్‌లో డిసెంబర్ 1, 5వ తేదీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు 8న వెలువడనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News