Monday, January 20, 2025

బిల్ క్లింటన్‌కు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

 

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్ సోకిందని, తనకు వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని 76 సంవత్సరాల క్లింటన్ బుధవారం ట్వీట్ చేశారు. మూత్రకోశానికి ఇన్ఫెక్షన్ సోకడంతో గత ఏడాది అక్టోబర్‌లో ఆసుపత్రిలో ఏరి చికిత్స పొందిన క్లింటన్ ఇప్పుడు కరోనా బారినపడ్డారు. అమెరికాకు 42వ అధ్యక్షుడిగా 1993 నుంచి 2001 వరకు రెండు పర్యాయాలు క్లింటన్ పనిచేశారు.. కొవిడ్ వ్యాక్సిన్‌తోపాటు బూస్టర్ డోసు కూడా వేసుకోవడం వల్ల తనకు లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు క్లింటన్ పనిచేశారు. ఆయన భార్య హిల్లరీ క్లింటన్ 2016లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసి డోనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News