Monday, December 23, 2024

టెన్నిస్ కలిపింది 60 దాటిన ఆ ఇద్దరినీ

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ప్రేమను అడ్డుకునే వయస్సు గేట్లు లేనేలేవని బిల్ గేట్స్ రుజువుచేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఐటి కంపెనీ మైక్రోసాఫ్ట్ బాస్ ,67 ఏండ్ల బిల్‌గేట్స్ మరోసారి ప్రేమ సంబంధిత సంబంధాలలో పడ్డారు. ఓ ఏడాది అంతకు ముందు నుంచే బిల్‌గేట్స్ 60 ఏండ్ల పాలా హర్డ్‌తో ప్రేమాయణం, షికార్లు, చివరికి డేటింగ్‌లు కూడా నిర్వహిస్తున్నారని, గత నెలలో వీరిద్దరూ ఆస్ట్రేలియా ఓపెన్‌టెన్నిస్‌పోటీలకు జంటగా హాజరయినట్లు ఇప్పుడు పీపుల్ మేగజైన్‌లో రంగుల ఫోటో ప్రచురించించారు. సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్ సిఇఒ , దివంగత మార్క్ హర్డ్ భార్య అయిన పాలాతో బిల్‌గేట్స్ స్నేహం చాలా దూరం వరకూ వెళ్లిందని పత్రిక తెలిపింది. మార్క్ 2019లో మృతి చెందారు. దీనితో ఒంటరి అయిన పాలా బిల్‌గేట్స్‌కు దగ్గరయింది. ఇప్పుడు ఏకాంత దశకు చేరుకుంటున్న వీరు ఆస్ట్రేలియా ఓపెన్ దశలో పబ్లిగ్గా కన్పించారు.

పక్కపక్కన కూర్చుని మ్యాచ్ చూస్తూ ఆనందించారు. వీరుఇప్పుడు విడదీయరాని జంట అయ్యారని ఈ వదంతుల జంటకు కావల్సిన వ్యక్తి ఒక్కరు న్యూస్.కామ్. ఎయూకు తెలిపారు. ఏడాదిగా కలిసే ఉంటున్నారని , ఈ మహిళ బిల్‌గేట్స్ జీవితంలో అదృశ్య మహిళ అని కొందరు అంటారు కానీ ఇది నిజం కాదని, దగ్గరి వారికి వీరి రోమాన్స్ గురించి చాలా కాలంగా తెలుసునని ఈ డాట్‌కామ్ వ్యక్తి తెలిపారు. పాలా భర్త తన 62వ ఏట సుదీర్ఘ కాలం క్యాన్సర్ తరువాత 2019 అక్టోబర్‌లో మృతి చెందాడు. శ్రీమతి హర్డ్ ఈవెంట్ నిర్వాహకులుగా, ధార్మికవేత్తగా పేరొందారు. ఓ దశలో టెక్ ఎక్సిక్యూటివ్ కూడా. ఆమెకు , బిల్‌గేట్స్ మాదిరిగానే టెన్నిస్ అంటే ఇష్టం. భర్త ఉన్నప్పుడు కూడా ఆమె బిల్‌గేట్స్‌తో కలిసి టెన్నిస్ చూసేందుకు సరదాగా వెళ్లేదని మరో వార్తాకథనంలో వెల్లడైంది. ఇక బిల్‌గేట్స్ 2021లో మేలింద ఫ్రెంచ్‌తో విడాకులు పొందారు. 30 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత వీరు విడిపొయ్యారు. అయితే వీరి కలయికలో వచ్చిన బిల్, మెలిందా గేట్స్ ఫౌండేషన్ చెక్కుచెదరకుండా సంయుక్తంగానే సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News