Thursday, January 23, 2025

బిల్ గేట్స్ చేతిలో రోటీ… ఫిదా అయిన మోడీ (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, దాతృత్వంలో మేటిగా పేరుపొందిన బిల్ గేట్స్ తాజాగా రోటీ తయారుచేసి పాకశాస్త్రంలో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. అందుకుగాను ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. తాను రోటీ తయారు చేస్తున్న వీడియోను బిల్ గేట్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. బిల్ గేట్స్‌కు రోటీ ఎలా తయారుచేయాలో తాను నేర్పించినట్లు రచయిత, వ్యాపారి ఈటన్ బెర్మాథ్ వెల్లడించడంతోపాటు ఇద్దరూ కలసి చపాతీ తయారుచేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

బిల్ గేట్స్ గోధుమ పిండితో రోటీ తయారు చేయడం పట్ల ప్రదాని మోడీ సంతోషం వ్యక్తం చేస్తూ సూపర్బ్ అంటూ కామెంట్ చేశారు. ఆరోగ్యానికి మేలు చేసే తృణధాన్యాలు ఇప్పుడు బారత్‌లో కొత్త ట్రెండ్‌గా మోడీ అభివర్ణిస్తూ తృణధాన్యాలతో అనేక వంటకాలు తయారు చేయవచ్చని తెలిపారు. ఈసారి వాటితో వంటలు ప్రయత్నించండి అంటూ బిల్ గేట్స్‌కు మోడీ సలహా కూడా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News