Wednesday, January 22, 2025

రాజ్యసభలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల నిరసనల నడుమ నేడు(శుక్రవారం) రాజ్యసభలో యూనిఫామ్ సివిల్ కోడ్(యూసిసి) బిల్లును ప్రవేశపెట్టారు. బిజెపి సభ్యుడు కిరోడి లాల్ మీనా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 63 మంది సభ్యులు ఓటేయగా, 23 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఇది దేశాన్ని అనైక్యపరుస్తుందని వ్యతిరేకిస్తూ మూడు తీర్మానాలను పెట్టారు. కానీ అవి 6323 ఓట్ల తేడాతో వీగిపోయాయి.

మతాధారిత పర్సనల్ లాస్‌ను తొలగించాలని ఈ కోడ్ కోరుకుంటోంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, డిఎంకె నిరసన వ్యక్తపరచగా, బిజూ జనతా దళ్ సభ నుంచి వాకౌట్ చేసింది. యూసిసి అన్నది అనేక ఎన్నికల్లో బిజెపి మెనిఫెస్టోగా ఉంది. కాగా ప్రైవేట్ మెంబర్ బిల్లు పెండింగ్‌లోనే ఉంది, దానిని ఇంకా ప్రవేశపెట్టలేదు.
యూసిసి అన్నది మతం, లింగం వంటివి చూడకుండా అందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలని కోరుకుంటోంది. యూనిఫామ్ సివిల్ కోడ్ తప్పనిసరి, అభిలషణీయమైనదేమి కాదని లా కమిషన్ నివేదిక పేర్కొంది. ఆ రిపోర్టును సిపిఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఈ సందర్భంగా ఉటంకించారు. కాగా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఆర్‌జి వర్మ ఈ చట్టం రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు.

యూనిఫామ్ సివిల్ కోడ్ లౌకిక వాదానికి వ్యతిరేకంగా ఉందని డిఎంకెకు చెందిన తిరుచి శివ పేర్కొన్నారు.
దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలుచేయడంపై చర్చించేందుకు బిజెపి ఎంపీ హర్నాథ్ సింగ్ యాదవ్ జీరో అవర్‌లో రాజ్యసభలో నోటీస్ జారీ చేశారు.

రాజ్యసభలో ఏ బిల్లునైనా ప్రవేశపెట్టవచ్చు. ప్రతి సభ్యుడు నాలుగు బిల్లులను ప్రతి సెషన్‌లో ప్రవేశపెట్టారు. ప్రైవేట్ మెంబర్ బిల్లులను శుక్రవారం మధ్యాహ్నం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ప్రతి సెషన్‌లో 100కు పైగా ప్రైవేట్ బిల్లులను వివిధ అంశాలపై ప్రవేశపెడుతుండేవారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News