Thursday, November 14, 2024

హెడ్‌ఫోన్స్‌తో బిలియన్ మంది యువతకు వినికిడి ముప్పు..

- Advertisement -
- Advertisement -

హెడ్‌ఫోన్స్‌తో బిలియన్ మంది యువతకు వినికిడి ముప్పు
సౌత్ కరోలినా వైద్య విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడి
అధ్యయనాన్ని ప్రచురించిన బిఎంజె గ్లోబల్ హెల్త్ పత్రిక
వాషింగ్టన్: బిలియన్ మందికిపైగా టీనేజర్లు, యువకులు హెడ్‌ఫోన్స్‌లో పెద్దస్థాయిలో సంగీతం వినడంతో వినికిడి ముప్పును ఎదుర్కోనున్నారు. ఇయర్‌బడ్స్‌ను ఉపయోగించి బిగ్గరగా సంగీతం వినడం, భారీస్పీకర్లుతో ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాలకు హాజరుకావడం వల్ల చెవులకు సంబంధిత రుగ్మతలు వచ్చే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు అధ్యయనాన్ని గ్లోబల్ హెల్త్ పత్రిక ప్రచురించింది.అమెరికాలోని సౌత్ కరోలినా వైద్య విశ్వవిద్యాలయ పరిశోధకులుతోపాటు అంతర్జాతీయ బృందం అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయనాన్ని బిఎంజె గ్లోబల్ హెల్త్ పత్రిక ప్రచురించింది. ప్రపంచ దేశాలు యువత ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని వినికిడి విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధ్యయనకర్తలు సూచించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మంది ప్రజలు వినికిడి లోపాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రధానంగా యువత వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించి భారీస్థాయిలో సంగీతాన్ని వినేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు, హెడ్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్ వినియోగించడం, భారీస్థాయిలో నిర్వహించే మ్యూజిక్ ఈవెంట్లలో ఎక్కువగా పాల్గొంటున్నారు. గత అధ్యయనంలో యువత 105 డెసిబెల్ వ్యాల్యూమ్‌తో వింటున్నట్లు తేలింది. అదేవిధంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్లలో 104 నుంచి 112డిబి సగటు శబ్దంగా నమోదైంది. పెద్దలకు అనుమతించిన 80-డిబి శబ్దస్థాయి, పిల్లలకు అనుమతించిన ఇది చాలా అధికం. సురక్షితంగాని స్థాయిలో ఎక్కువగా శబ్దాన్ని లేదా సంగీతాన్ని వినడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వినికిడి లోపం ఎక్కువ అవుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. అధ్యయనంలో భాగంగా

పరిశోధకులు ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్ భాషల్లో ప్రచురితమైన సమాచారాన్ని పరిశోధించారు. 33అధ్యయనాలు, 35రికార్డుల డేటా, 19,046 మంది అధ్యయనంలో పాల్గొన్నవారు తెలిపిన వివరాలు, వ్యక్తిగత వినికిడి పరికరాలపై 17రికార్డులు, 18 భారీ సంగీత వేదికలను ఆధారం చేసుకుని పరిశోధన నిర్వహించారు. ప్రపంచ జనాభాలో 12 నుంచి 34 ఏళ్ల వయసున్నవారు 2022లో 2.8బిలియన్ మంది వినికిడి ముప్పును ఎదుర్కోనున్నారని పరిశోధకులు అంచనావేశారు. ప్రపంచవ్యాప్తంగా శాతం టీనేజర్లు, 48శాతం యువత వ్యక్తిగత ఎలక్ట్రిక్ వినికిడి పరికరాలను వినియోగించి సురక్షితంకాని విధానంలో శబ్దాలను వింటున్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా లోపం వచ్చే ప్రమాదం ఉన్న టీనేజర్లు, యువత సంఖ్య 0.67 నుంచి బిలియన్ వరకు ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు.

Billion Youth risk hearing loss from headphones

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News