నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్‌పై హరి నిర్మాణంలో తెరకెక్కిన ‘బింబిసార’ ఇటివలే రిలీజై భారీ సక్సెస్ అందుకుంది. ఈ సందర్భంగా సినిమా టీం డిస్ట్రిబ్యూటర్స్‌తో కలిసి సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో దిల్ రాజు మాట్లాడుతూ “సినీ పరిశ్రమ చాలా ఇబ్బందుల్లో ఉందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇలాంటి కష్టకాలంలో దర్శకుడు వశిష్ట్ పెద్ద హిట్ ఇచ్చి ఇండస్ట్రీకి ఊపిరిపోశాడు. ఏ సినిమాకైనా దర్శకుడు, నిర్మాత, హీరోనే ముఖ్యం. ఈ ముగ్గురు ఉంటేనే సినిమాను ఏ స్థ్థాయికైనా తీసుకెళ్లొచ్చు. వీరితోనే సినిమా హిట్ అవుతుంది” అని అన్నారు.
హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ “మా సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ అందరూ మేం రికవరీ అయిపోయాం, చాలా హ్యాపీగా ఉన్నాం అని చెబుతుంటే ఎంతో సంతోషంగా ఉంది. రెండున్నర సంవత్సరాలు కష్టపడి భారీ బడ్జెట్‌తో ఓ గ్రాండియర్ సినిమా చేశాం. ఒక మంచి సినిమా తీసి జనాలకి అందిస్తే వాళ్ళు బ్రహ్మరథం పడతారని ఈ సినిమా నిరూపించింది. ఇంత గొప్ప కథ అందించిన మా డైరెక్టర్ వశిష్ట్‌కి, అలాగే సినిమా చూసి రిలీజ్ చేసిన దిల్‌రాజు, శిరీష్‌లకు థాంక్స్”అని పేర్కొన్నారు. ఈ వేడుకలో చిత్ర దర్శకుడు వశిష్ట్, చోటా కె. నాయుడు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘Bimbisara’ Movie Unit Success Meet