Wednesday, January 22, 2025

బైనరీ సిస్టంపై… చర్యలు శూన్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత ఎన్నికల్లో పాతబస్తీకి కేంద్రంగా బైనరీ సిస్టం ఓట్లు దందా నడిచింది. కొందరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులు నకిలీ ఓట్లను జాబితాలో నమోదు చేశారు. ఇలా నమోదు చేసిన ఓట్లను వేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళలను ఓటుకు పంపారు. ఒక ఓటు వచ్చిన వారి వేలిపై ఉన్న గుర్తును కెమికల్‌తో తొలగించి మళ్లీ ఓటు వేసేందుకు పంపించారు. ఈ దందా పాతబస్తీ కేంద్రంగా కొనసాగింది. ఈ విషయం పోలింగ్ ముగిసిన మరుసటి రోజు బయటపడడంతో కొందరు ఎలక్షన కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లారు.

దీనిపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయం ఇప్పటి వరకు తెలియలేదు. ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తి కనీసం వంద ఓట్లు వేసే అవకాశం ఉంది, ముఖ్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళలు ఇలా ఓట్లు వేసినట్లు బయటపడింది. దీనిని ఆసరాగా చేసుకుని ఎలక్షన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. ఇలా చేసేందుకు కొంతమంది మహిళలను డబ్బులు ఇచ్చి నియమించుకుని పనిపూర్తి చేసుకున్నారు. గత ఎన్నికల్లో బోగస్ ఓట్లపై చాలా ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి.

ముఖ్యంగా హైదరాబాద్‌లోని నాంపల్లి నియోజకవర్గంలో కరీంనగర్‌కు చెందిన వారి ఓట్లు నమోదు చేసి రిగ్గింగ్ చేస్తున్నారని అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపించారు. ఇలా బోగస్ ఓట్లను నమోదు చేయించి, బైనరీ సిస్టంలో నకిలీ వ్యక్తులతో ఓట్లు వేసి గెలుస్తున్నట్లు పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇలాంటి చర్యలను ఎలక్షన్ కమీషన్ అడ్డుకోవాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు ఇలా దొంగ ఓట్లు వేసే బైనరీ సిస్టంను ఇప్పటి వరకు ఎక్కడా చేయలేదు. మొదటిసారిగా హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో చేశారు. దీంతో చాలామంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

నకిలీ ఓట్లను అడ్డుకునేందుకు ఎలక్షన్ కమిషన్ ఐడి కార్డు సిస్టంను తీసుకుని వచ్చింది. కార్డు చూపించిన వారి ఫొటో సరిపోలితేనే ఓటు వేయనిస్తారు, కాని పాతబస్తీ ఏరియాలో కార్డు చూసి ఫేస్ మ్యాచ్ అయ్యే వరకు వేయకుండా పోలింగ్ ఆఫీసర్ అడ్డుకునే పరిస్థితి లేదు. పోలింగ్ సమయంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని ఓ పార్టీకి చెందిన వారు భయభ్రాంతులకు గురిచేయడంతో బైనరీ సిస్టంలో ఓట్లు వేస్తున్నట్లు పోలింగ్ సిబ్బందికి తెలిసినా కూడా వెనుకడుగు వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News