కోటాను మించి కృష్ణా జలాలను వాడుకుంటున్న ఆంధ్ర
తెలంగాణ తాగునీటి నిల్వలను సైతం వాడుకుంటున్న దారుణం
బోర్డుకు ఇఎన్‌సి లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీజలాల్లో ఎపి ప్రభుత్వం ఆ రాష్ట్రానికి కే టాయించిన కోటానీటికంటే అధికంగా వాడుకోకుండా కట్టడి చేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్యబోర్డును కోరింది. నీటిపారుదల శాఖ ఇఎన్‌సి మురళీధర్ శుక్రవారం బో ర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. గత నీటి సంవత్సరం లో కృష్ణనదీజలాల నుంచి 50:50 నిష్పత్తికంటే అధికంగా 205.20టిఎంసీల నీటిని వాడుకుందని లేఖలో వివరించారు. అలాకాకుండా 34: 66 నిష్పత్తిలో చూసినా 51.74టిఎంసిల నీటిని అధికంగా వాడిందని తెలిపారు. నాగార్జున సాగర్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర కోటానీటిని కూడా వాడుకుందని తెలిపారు. నాగార్జున సాగర్ రెం డు రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్ అని ఇందులో తెలంగాణ రాష్ట్రం తాగునీటి అవసరాల కోసం 18.70టిఎంసిలు నిల్వ ఉంచుకుందన్నారు. 202324సంవత్సరంలో భవిష్యత్ అవసరాలకోసం ఈ నీటిని ఉపయోగించుకునేందుకు ని ల్వ ఉంచినట్టు వివరించారు.
ఆ నీటిలో కూడా తాగునీటి అవసరాల పేరుతో ఎపి ప్రభుత్వం జులై నెలలో 5 వాడుకుందని తెలిపారు ఈ నీటి సంవత్సరంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇప్పటివరకూ నీటి చేరిక లేదన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఇఎన్‌సి మురళీధర్ కృష్ణాబోర్డు చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.