బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు మరో పతకం దక్కింది. వెయిట్ లిఫ్టింగ్ లో 55 కిలోల విభాగంలో బింద్యారాణి దేవి రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకుంది. అయితే క్లీన్ అండ్ జర్క్ రెండో ప్రయత్నంలో 114 కిలోలు ఎత్తడంలో విఫలమైంది. చివరి రౌండ్‌లో పుంజుకున్న బింద్యారాణి 116 కిలోలు ఎత్తి రజతం దక్కించుకుంది. నైజీరియాకు చెందిన అడిజట్ ఒలారినోయ్ 117 కిలోల బరువు ఎత్తి బంగారు పతకం సాధించింది. ఇప్పటివరకు కామన్వెల్త్ క్రీడల్లో భారతకు నాలుగు పతకాలు దక్కాయి. వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు ఒక స్వర్ణం, 2 రజతాలు, ఒక కాంస్యం లభించాయి. బర్మింగ్‌హామ్‌లోని కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాన్ని గెలుచుకున్నందుకు బింద్యారాణి దేవికి ప్రదాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ సాఫల్యం ఆమె దృఢత్వానికి నిదర్శనం, ఇది ప్రతి భారతీయునికి ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.