- Advertisement -
హైదరాబాద్: బయో ఏషియా సదస్సుకు హైదరాబాద్ మరోసారి వేధికగా మారింది. ఈ సదస్సు ఫిబ్రవరి 24న ప్రారంభంకానుంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. కోవిడ్ నేపథ్యంలో ఈ సారి బయో ఏషియా సదస్సు వర్చువల్ గా జరుగుతుంది. ఈ సంవత్సరం సదస్సు థీమ్” ఫ్యూచర్ రెడీ” పేరు తో నిర్వహించబడుతుంది. లైఫ్-సైన్సెస్ ఫోరమ్‌కు వర్చువల్‌గా 70కి పైగా దేశాల నుండి 30 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. బయోఏషియా 2022 సదస్సులో ప్రభుత్వం, పరిశ్రమలు, పెట్టుబడిదారులు, విద్యాసంస్థల నుండి ప్రముఖ వక్తలు పాల్గొంటారు. బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఫ్లాగ్ షిప్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
- Advertisement -