మనతెలంగాణ, హైదరాబాద్ : రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు (టిఎస్‌బిబి) రాష్ట్రవ్యాప్తంగా 13,759 జీవ వైవిధ్య కమిటీలను ఏర్పాటు చేసింది. డిజిటల్ డాష్‌బోర్డ్‌లో 13,165 పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్‌లను సిద్ధం చేసిందని టిఎస్‌బిబి ప్రాంతీయ సమన్వయకర్త శిల్పిశర్మ తెలిపారు. ఈ మేరకు చెన్నైలోని నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ (ఎన్‌బీఏ)కి చెందిన సెంట్రల్ పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ (పీబీఆర్) మానిటరింగ్ కమిటీకి ఆమె సమాచారం అందించారు.జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) సూచనల మేరకు జీవ వైవిధ్య కమిటీల పనితీరు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో నిపుణుల బృందం రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించింది. బొటానికల్ సర్వేఆఫ్ ఇండియా రిటైర్డ్ డైరెక్టర్ మునివెంకటప్పసానప్ప, వృక్షశాస్త్ర ప్రొఫెసర్ నరసింహన్, డాక్టర్ శర్మతో అధికారుల బృందం వికారాబాద్ జిల్లా చింతకుంట, రంగారెడ్డి జిల్లా మనసాన్‌పల్లిలోని జీవ వైవిధ్య కమిటీల ప్రతినిధులను వారు కలిసిశారు. స్థానికంగా లభించే అటవీ ఉత్పత్తులు, వాటి లభ్యత, వినియోగం, వృక్షజాతులు, నేల రకాలు తదితర అంశాలపై స్థానిక జీవవైవిధ్య కమిటీ ప్రతినిధులతో మాట్లాడారు. సీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తయారు చేసిన జీవ వైవిధ్య వనరుల ప్రదర్శనను వారు తిలకించారు.
జీవ వైవిధ్య కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన
- Advertisement -
- Advertisement -
- Advertisement -