Thursday, January 23, 2025

రాష్ట్రపతి ముర్మూకు విలువైన మిస్డ్‌కాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ జీవితంలో ఓ విలువైన మిస్డ్‌కాల్ ఉంది. ఇది నిజంగా ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన ఫోన్‌కాల్. అయితే ఎప్పుడో కానీ తరచూ సెల్ ఫోన్ వాడకుండా పక్కనపెట్టే ద్రౌపదీ ముర్మూ 2022 జూన్ 21 సెల్‌కు వచ్చిన ఫోన్ కాల్ గురించి పట్టించుకోలేదు. రాష్ట్రపతిగా ఎంపికచేశాం, ఎన్‌డిఎ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు రావాలని ఆమెకు కీలకమైన ఫోన్ కాల్ ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చింది. పలుసార్లు ఫోన్ చేసినా ఆమె దీనిని గుర్తించకపోవడంతో పిఎంఒ వారు గతంలో ఆమెకు జార్ఖండ్‌లో ఓఎస్‌డిగా పని చేసిన బికాష్ చంద్ర మొహంతోకు ఫోన్ చేసి విషయం తెలిపారు. దీనితో ఉరుకులు పరుగులపై ఓ చేతిలో తన ఫోన్‌తో ముర్మూ నివాసానికి వచ్చి విషయం తెలిపారు.

ఇటువంటి పలు విషయాల సమాచారంతో కూడిన ద్రౌపదీ ముర్మూ జీవిత చరిత్ర ద్రౌపదీ ముర్మూ  ఫ్రమ్ ట్రైబల్ హింటెర్‌లాండ్స్ టు రైసినా హిల్స్ పుస్తకంలో జర్నలిస్టు కస్తూరి రే వివరించారు. రూపా ముద్రణ సంస్థ వెలువరించిన ఈ బయోగ్రఫీ ఇటీవలే వెలుగులోకి వచ్చింది. గత ఏడాది జూన్‌లో ముర్మూ ఒడిషాలోని రాయ్‌రంగ్పూర్‌లో ఉన్నారు, తన సొంత ఊరు ఉపబర్బెదకు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ఆమె ఉండగా ఆమెకు దేశ రాష్ట్రపతి పదవికి ఆహ్వానం తలుపుతట్టింది. ఆమెకు ఫోన్ రావడం, రాష్ట్రపతిగా ఆమె ఎన్‌డిఎ తరఫున ఎంపికైనట్లు టీవీలలో ప్రసారం కావడం అటూ ఇటూగా ఏకకాలంలో జరిగాయి. అయితే టీవీల్లో వార్తల దశలో ఆమె ఊరిలో కరెంటు లేకుండా పోయింది. తరువాత విషయం ఆమెకు ఢిల్లీ ఉన్నతాధికారుల ద్వారా నిర్తారణ అయింది.

Also Read: ఢిల్లీలో టీచర్ ప్రాణం తీసిన వాన

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News