Saturday, December 21, 2024

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
రూ.1800 కోట్లతో బయోలాజికల్ ఇ విస్తరణ ప్రణాళిక
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ జినోమ్ వ్యాలీలో పెట్టుబడి పెట్టనున్నది. రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంతి కెటిఆర్‌తో గురువారం జరిగిన భేటీలో సంస్థ ప్రతినిధులు విస్తరణ ప్రణాళికలను ప్రకటించారు. జినోమ్ వ్యాలీలోని తమ ప్లాంట్‌లో రూ.1800 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు మంత్రి కెటిఆర్‌కు వివరించారు. దీంతో 2500 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ కోవిడ్ వ్యాక్సిన్, ఎంఆర్ వ్యాక్సిన్, పిసివి వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్, టెటానస్ టాక్సైడ్ ఆంపౌల్స్, బయోలాజికల్ ఎపిఐలు, ఫార్ములేషన్స్ తయారీపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. జినోమ్ వ్యాలీలో బయోలాజికల్ ఇ విస్తరణను ప్రకటించడంపై మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ల రాజధానిగా పేరుగాంచిందన్న కెటిఆర్. బయోలాజికల్ ఇ విస్తరణతో దీనికి మరిం బలం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బయోలాజికల్ ఇఎండి మహిమాదాట్ల, రాష్ట్ర ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచంలోనే ఏకైక ప్రాంతంగా హైదరాబాద్
హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో బయోలాజికల్ మరో భారీ పెట్టుబడితో ముందుకు రావడం ఆనందంగా ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. దీంతో 14 బిలియన్ డోస్ వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేసేలా ప్రపంచంలో ఏకైక ప్రాతంగా హైదరాబాద్ నిలవనుందని తెలిపారు. హైదరాబాద్ ఇప్పటికే ‘వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’గా పేరు పొందిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు.
‘కూ’తో ఒప్పందం
సామాజిక మాధ్యమాలు ప్రజలందరికీ అర్ధమయ్యే విధంగా ఉంటే ప్రభుత్వం అదనంగా మరింత వేగంగా, మెరుగ్గా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్ల డౌన్‌లోడ్స్ ఉన్న ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ‘కూ’ తెలంగాణలో అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కెటిఆర్ సమక్షంలో ‘కూ’ ప్రతినిధులు, ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ప్రస్తుతం దేశంలో హిందీ, తెలుగు సహా పది భాషల్లో స్థానిక భాషల్లో వీడియోలు, ప్రాంతీయ భాషల్లో రాసి పోస్టు చేసే అవకాశం ఉన్నందున ‘కూ’ సంస్థ భవిష్యత్తులో మరిన్ని భాషలకు విస్తరింపజేయనుంది. ప్రతి విషయాన్ని ట్విట్టర్ తరహాలో పోస్ట్ చేసుకునే అవకాశాన్ని, మరిన్న ఆప్షన్లను కలిగి ఉండటం ‘కూ’ యాప్ ప్రత్యేకతగా నిలుస్తోంది.

Biological E to Invest Rs 1800 Crore in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News