Friday, November 15, 2024

కేంద్ర ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్ హాజరు

- Advertisement -
- Advertisement -

నవంబర్ 8 నుంచి పునరుద్ధరణకు కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ: ఈనెల 8వ తేదీ నుంచి అన్ని స్థాయిలలోని ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బయోమెట్రిక్ మెషీన్ల పక్కన శానిటైజర్లు ఉంచాలని, ఉద్యోగులు అటెండెన్స్ వేయడానికి ముందు, తరువాత తప్పనిసరిగా తమ చేతులను శానిటైజ్ చేసుకునేందుకు వీటుగా అన్ని శాఖల అధిపతులు చర్యలు తీసుకోవాలని కేంద్ర సిబ్బంది మంత్రిత్వశాఖ సోమవారం ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తిని పురస్కరించుకుని గత కొంతకాలంగా ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అటెండెన్స్ వేసే సమయంలో ఉద్యోగులు ఆరు అడుగుల చొప్పున భౌతిక దూరం పాటించాలని, ఉద్యోగులు ఒకే చోట గుమికూడకుండా చూసేందుకు అవసరమైతే అదనంగా బయోమెట్రిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విభాగాలను సిబ్బంది శాఖ ఆదేశించింది. ఉద్యోగులు విధుల్లో ఉన్న సమయంలో ఎల్లవేళలా మాస్కులు లేక ఫేస్ కవర్లు ధరించడం తప్పనిసరని కూడా తెలిపింది. సాధ్యమైనంత వరకు సమావేశాలను వీడియా కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించాలని, అవసరమైతే తప్ప భౌతిక సమావేశాలు, సందర్శకులను కలుసుకోవడం వంటివి చేయకూడదని సిబ్బంది శాఖ ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News