- Advertisement -
బెర్లిన్ : జర్మనీ ఫార్మా కంపెనీ బయోఎన్‌టెక్ కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన తరువాత ఇప్పుడు మలేరియా టీకా తయారీకి ప్రయత్నాలు ప్రారంభించింది. ఎంఆర్‌ఎన్‌ఎ టెక్నిక్‌ను దీనికోసం ఉపయోగించనున్నది. బయోఎన్‌టెక్ సంస్థ 2022 చివరినాటి కల్లా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రారంభించాలనే లక్షం పెట్టుకుంది. మలేరియా నిర్మూలన ప్రాజెక్టులో భాగంగా బయోఎన్‌టెక్ ఈ తయారీని చేపడుతోంది. కెనఫ్ ఫౌండేషన్ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. దోమల వల్ల వచ్చే వ్యాధులను అంతం చేయడమే ఈ ప్రచార లక్షం. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆఫ్రికా లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మద్దతు ఇస్తున్నాయి.
BioNTech to develop mRNA malaria vaccine
- Advertisement -