Wednesday, January 22, 2025

గుజరాత్‌లో బిపర్‌జాయ్ బీభత్సం…

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: గుజరాత్‌లో బిపర్‌జాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తుంది. అరేబియా సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. గుజరాత్ తీరం వెంబడి 120 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. 94 వేల మందిని తాత్కాలిక శిబిరాలకు అధికారులు తరలించారు. తుపాను ప్రభావంతో గుజరాత్‌లోని ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ద్వారకా, ఒఖా, నాలియా, భుజ్, పోర్‌బందర్, కాండ్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. భావ్‌నగర్ జిల్లాలో వరదనీటిలో చిక్కుకుని ఇద్దరు మృతి చెందారు. బలమైన గాలులు వీయడంతో చెట్లు విరిగిపడి 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీయడంతో దేవభూమి జిల్లాలో చెట్లు కూలిపోయాయి. కచ్ జిల్లాలోని జఖౌ, మాండ్విలో కరెంటు స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. బలమైన గాలులు వీయడంతో పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భద్రతా బలగాలు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Also Read: పుజారా ఔట్… యశస్వి జైస్వాల్ ఇన్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News