Wednesday, January 22, 2025

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిపాషా బసు

- Advertisement -
- Advertisement -

 

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ నటి బిపాషా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ తల్లిదండ్రులు అయ్యారు. ముంబైలోని ఖార్‌లోని హిందూజా ఆసుపత్రిలో బిపాషా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిపాషా , కరణ్‌ల వివాహం ఏప్రిల్ 30,2016న ముంబైలో జరిగింది. ఇటీవల బిపాషా బేబీ బంప్‌తో సోషల్ మీడియాలో ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే పెళ్లైన ఆరేళ్ల తర్వాత పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తమ జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నట్లు కొన్ని నెలల క్రితమే ఈ జంట ప్రకటించింది. 2015లో వచ్చిన అలోన్ మూవీ షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు. బెంగాలీ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇటీవల బాలీవుడ్ స్టార్ కపుల్స్ ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ లకు కూడా పాప పుట్టిన ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News