Monday, January 20, 2025

వైరల్: కూతురు ఫోటోలను షేర్ చేసిన బిపాషా బసు

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ నటీనటులు బిపాషా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ ఎట్టకేలకు గత ఏడాది నవంబర్‌లో జన్మించిన తమ కూతురు దేవి ముఖాన్ని బయటపెట్టారు. ‘హలో వరల్డ్.. నేను దేవీ’ అంటూ పాప ఫోటోలను బిపాషా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీంతో ఆ ఫోటోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలను చూసిన పలువురు పరిశ్రమ స్నేహితులు, అభిమానులు బిడ్డను చూసి ఆనందించారు. ఆమెను ఆశీర్వదించారు. కొందరు పాప ఆమె తన తండ్రి కరణ్‌ను పోలి ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఎలోన్ సినిమాలో నటిస్తున్న సమయంలో కరణ్ సింగ్ గ్రోవర్ ను ప్రేమించిన బిపాషా కొన్నాళ్ల డేటింగ్ తరువాత 2016 లో వివాహం చేసుకున్నారు. 2022 నవంబర్ 12 వీరిద్దరికీ పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News