Wednesday, November 6, 2024

రావత్ హెలికాప్టర్ రేడియో కాంటాక్ట్ కోల్పోయింది!

- Advertisement -
- Advertisement -

Bipin Rawat loses helicopter radio contact

న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, మరో 11 మంది ఇతరులతో కలిసి వెళ్లిన హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాలకు బుధవారం నీల్‌గిరిస్‌లో కూలిపోయింది. ఆ హెలికాప్టర్ ల్యాండింగ్ కావడానికి కేవలం 7 నిమిషాలుందనగా కూలిపోయింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎంఐ17వి5 హెలికాప్టర్ సూలూరు విమాన స్థావరం నుంచి ఉదయం 11.48 గంటలకు బయలుదేరింది. అది మధ్యాహ్నం 12.15 గంటలకు వెల్లింగ్టన్‌లో ల్యాండ్ కావాల్సి ఉండింది. అయితే మధ్యాహ్నం 12.08 గంటలకు ఆ హెలికాప్టర్ కాంటాక్ట్ కోల్పోయిందని అధికార వర్గాలు విలేకరులకు తెలిపారు. జనరల్ రావత్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌ను సందర్శించి అక్కడ స్టూడెంట్ ఆఫీసర్లతో ఇంటరాక్ట్ కావలసి ఉండింది. స్థానికులు కొందరు ఆ హెలికాప్టర్ కూనూర్ అడవిలో కూలిపోవడం, కాలిపోవడం చూశారు. వారికి తక్కువ ఎత్తులో ఆ హెలికాప్టర్ ఎగురుతూ చివరికి మంచులో కనుమరుగైపోవడం కనిపించింది.

ఎయిర్ చీఫ్ మార్షల్ ఫాలీ హెచ్ మేజర్ తప్పెక్కడ జరిగి ఉంటుందా అని విస్మయాన్ని ప్రకటించారు. “సూలూరు నుంచి వెల్లింగ్టన్‌కు హెలికాప్టర్ వెళ్లగలిగే సమయం 20 నుంచి 25 నిమిషాలు. ఇంతటి తక్కువ సమయంలో ఏమి జరిగి ఉంటుందో?” అని ఎయిర్ చీఫ్ మార్షల్ తెలిపారు. ఆయనలాగే అనేక మంది రిటైర్డ్ సైనిక అధికారులు కూడా విస్మయాన్ని ప్రకటించారు. ‘బ్లాక్ బాక్ష్’ లేక ఫ్లయిట్ డేటా రికార్డరును కూలిన హెలికాప్టర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. దానివల్ల కూలిపోవడానికి కారణం ఏమిటో తెలుస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో గురువారం ఉదయం తెలిపారు. ఎయిర్ ఫోర్స్ ట్రై సర్వీసెస్ ఇంక్వయిరీని కూడా ఆదేశించిందని, అదిఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News