- Advertisement -
న్యూఢిల్లీ: త్రిపురలో ఈ నెల 22న జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్‌ను బిజెపి ఎంపిక చేసింది. తన స్థానంలో ముఖ్యమంత్రిగా మానిక్ సాహా బాధ్యతలు చేపట్టడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి బిప్లవ్ దేవ్ పోటీచేయనున్నారు. త్రిపుర అసెంబ్లీలో బిజెపికి మెజారిటీ ఉన్నందున బిప్లవ్ దేవ్ ఎన్నిక సునాయాసం కానున్నది. వచ్చే ఏడాది ప్రారంభంలో త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్టా బిప్లవ్ దేవ్‌ను రాజ్యసభకు పరిమితం చేయాలని బిజెపి భావిస్తోంది. అంతేగాక ఆయనను పార్టీ హర్యానా వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించడం కూడా రాష్ట్రంలో ఆయన పాత్రను నామమాత్రం చేయాలన్న ఆలోచనకు కారణంగా కనిపిస్తోంది.
- Advertisement -