- Advertisement -
మనతెలంగాణ/గూడూరు: గూడూరు మండలంలోని గాజులగట్టు గ్రామంలో సోమవారం కురుమల ఆరాధ్య దైవమైన బీరప్ప కామరతి కళ్యాణ వేడుకలు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు. మహిళలు ఉదయం వేళల్లోనే స్వామి వారికి బోనాలు సమర్పించారు. వీరన్నలు బోనాల చుట్టు గావు పట్టడం ఆకర్షించింది. శనివారం రోజున లింగాల కార్యక్రమాన్ని నిర్వహించగా సోమవారం స్వామివారి కళ్యాణ వేడుకలు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు.
ప్రతీఇంటా బంధుమిత్రులతో కళ్యాణ వేడకల సందర్భంగా కళకళలాడాయి. గ్రామం మొత్తంలో జన సందడి కనిపించింది. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అద్యక్షులు కంచు ప్రభాకర్, కుల పెద్దలు కంచ అనిల్, బీరప్ప ఆలయ కమిటీ సభ్యులు ఆర వీరన్న, చీర అశోక్, కోరే గౌరయ్య, చీర చిన్నమల్లయ్య, ఆరే కుమారస్వామి, ఐలయ్య, కుండె కుమారస్వామి తదితరులు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి కురుమల ఆచారాల గురించి వివరించారు.
- Advertisement -