Sunday, December 22, 2024

బొగ్గు గనిలో పేలుడు.. ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్ బీర్భమ్ జిల్లాలోని ఒక బొగ్గు గనిలో సోమవారం జరిగిన పేలుడులో నలుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. అయితే, బొగ్గు గనిలో జరిగిన పేలుడులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పశ్చిమ బెంగాల్ విద్యుత్ అభివృద్ధి సంస్థ(డబ్లుబిపిడిసిఎల్) వెల్లడించింది. భదూలియా బ్లాక్‌లో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికితీశామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. గంగారాంచర్, గంగారారంచక్‌భదూలియా బొగ్గు గనుల వద్ద పేలుడు నిర్వహించేందుకు డిటోనేటర్లు రవాణా చేస్తుండగా ఈ పేలుడు సంభవించినట్లు డబ్లుబిపిడిసిఎల్ అధికారి ఒకరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News