హైదరాబాద్: బర్డ్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తుండటంతో చికెన్, కోడి గుడ్ల తినకూడదని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో జనాలు చికెన్ తినేందుకు జంకుతున్నారు. ఆదివారం కావడంతో చికెన్ దుకాణాల వద్ద అమ్మకాల పరిస్థితి దారుణంగా పడిపోయినట్లు చికెన్ దుకాణాలు, కోళ్ల ఫారాల వద్ద స్పష్టంగా కనిపిస్తుంది. బర్డ్ ఫ్లూ వ్యాధి తెలంగాణాలో ప్రస్తుతం లేనప్పటికీ ప్రజల్లో కొంత భయాందోళన మాత్రం కనపడుతోందని చికెన్ ప్రియులు చెబుతున్నారు. చికెన్ కోడి గుడ్లు తింటే బర్డ్‌ఫ్లూ సోకే ప్రమాదం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. చికెన్ ప్రియులంతా చికెన్ ధర తగ్గిన, ప్రస్తుత పరిస్థితుల్లో విందులు, శుభకార్యాల్లో చికెన్ కొనుగోలు చేసేందుకు భయపడి మేక మాంసం వైపు వెళ్లామని ఫంక్షన్ నిర్వాహకులు తెలిపారు. చికెన్ ధరలు సైతం ఒక్కసారిగా పడి పోవడం, కిరాణ దుకాణాల్లో కోడిగుడ్లు కొనేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. దీంతో చేపలు, మాంసం దుకాణాల వద్ద తాకిడి పెరిగింది.
bird flu impact on chicken business in Telangana