Friday, November 22, 2024

కేరళ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ…1800 కోళ్లు మటాష్!

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళలోని కొజికోడ్‌లో ప్రభుత్వం నడుపుతున్న పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. దాదాపు 1800 కోళ్లు ఆ వ్యాధికి చనిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. స్థానిక పౌల్ట్రీ ఫారాలలో హెచ్5ఎన్1 వేరియంట్ ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

కేంద్ర మార్గదర్శకాలు, ప్రొటోకాల్ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి జె.చించు రాణి ఆదేశించారు. ప్రాథమిక పరీక్షల్లోనే బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వ్యాధి నిర్ధారణ కోసం శాంపిల్స్‌ను భోపాల్(మధ్యప్రదేశ్) లాబొరేటరీకి పంపించారు. అక్కడ ‘ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా’ నిర్ధారణ అయినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. పౌల్ట్రీ ఫారమ్‌లో 5000కు పైగా కోళ్లుండగా, వాటిలో వ్యాధి సోకి 1800 చనిపోయాయి. ప్రభుత్వ శాఖల సమన్వయంతో చుట్టుపక్కల ఉన్న జిల్లాలోని పౌల్ట్రీ ఫారాలలో కూడా ఏరివేత(కల్లింగ్) ప్రక్రియను చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News